Pawan Kalyan: 'రిపబ్లిక్' దర్శకుడికి పవన్ ఆఫర్?

Pawan Kalyan to work with Deva Katta
షార్ట్స్‌లో చూడండి
ఇటీవలి కాలంలో సినిమాల పరంగా జోరు పెంచిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పలు సినిమాలను లైన్లో పెడుతున్నారు. వీటిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' చేస్తున్న పవన్.. దీని తర్వాత 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని పూర్తిచేస్తారు. అనంతరం హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి చిత్రాలు చేయాల్సి వుంది. ఈ క్రమంలో ఆయన దేవ కట్టా దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా సాయితేజ్ హీరోగా దేవ కట్టా రూపొందించిన 'రిపబ్లిక్' సినిమా హిట్టయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇందులో ముఖ్యంగా సామాజిక సమస్యలను ఆయన ఆవిష్కరించిన తీరుకి మంచి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే ఆయన సంధించిన వాడీవేడి పవర్ ఫుల్ డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి పవన్ కల్యాణ్ ను కూడా బాగా ఆకట్టుకున్నట్టు, దాంతో ఆయన దేవ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.

తన కోసం ఓ మంచి కథను రెడీ చేయమని పవన్ ఆయనకు చెప్పినట్టు, దీనికి దేవ కట్టా ఆనందంతో అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పనిలోనే దర్శకుడు దేవ నిమగ్నమైనట్టు సమాచారం. అయితే, కథ రెడీ అయినప్పటికీ, ప్రస్తుతం పవన్ కమిట్ మెంట్స్ పూర్తయి, ఇది సెట్స్ కు వెళ్లడానికి కాస్త సమయం పట్టచ్చు!  
Go Back to Shorts
Pawan Kalyan
Deva Katta
Sai Dharam Tej

More Telugu News