'అంత ఇష్టం'... భీమ్లానాయక్ నుంచి మరో పాటకు ముహూర్తం ఫిక్స్
Add ap7am to your home Screen

'అంత ఇష్టం'... భీమ్లానాయక్ నుంచి మరో పాటకు ముహూర్తం ఫిక్స్

Second Single from Bheemla Nayak will be out soon
  • ఇప్పటికే భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ రిలీజ్
  • శ్రోతల నుంచి విశేష స్పందన
  • రెండో పాట అక్టోబరు 15న రిలీజ్
  • చిత్రబృందం ప్రకటన
పవన్ కల్యాణ్, రానా ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం భీమ్లానాయక్. పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ రిలీజై విశేష స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి రెండో పాట విడుదలకు ముహూర్తం ఖరారైంది. 'అంత ఇష్టం' అంటూ సాగే ఈ పాటను అక్టోబరు 15న దసరా సందర్భంగా తీసుకువస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది.

ఈ పాట అనేక ఏళ్లపాటు శ్రోతల చెవుల్లో మార్మోగుతుందని సంగీత దర్శకుడు తమన్ అంటున్నారు. తమ హృదయంలోంచి వచ్చిన పాట అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో పవన్ కు జంటగా నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Bheemla Nayak
Second Single
Pawan Kalyan
Thaman
Tollywood

More Telugu News