Telangana: సీఎం కేసీఆర్.. అమ్మ, అయ్య, అత్త, మామ.. భర్త కూడా అవుతున్నారు.. ఎమ్మెల్యే రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

MLA Rajaiah Controversial Comments On CM KCR
  • బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా వ్యాఖ్యలు
  • కేసీఆర్ కిట్లను ప్రస్తావించి కామెంట్ చేసిన ఎమ్మెల్యే
  • వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా లింగాల ఘనాపూర్ లో బతకుమ్మ చీరల పంపిణీ సందర్భంగా ఆయన ఆ కామెంట్లు చేశారు. కొత్త చీరలు కొనిచ్చి సీఎం కేసీఆర్ అవ్వ, అయ్య, అత్త, మామ అయ్యారని, భర్త కూడా అవుతున్నారని నోరు జారారు.

బాలింత మహిళలు ఆసుపత్రి నుంచి కేసీఆర్ కిట్ తీసుకుని ఇంటికొస్తున్నారని, అందులో బాలింత చీరలు, పరుపు, దుప్పటి, దోమతెర, సబ్బులు, నూనెలు, పౌడర్లు, టవళ్లు ఉంటాయని చెప్పారు. వాటిని అత్తామామ, భర్త, అయ్యా, అవ్వలు తెచ్చివ్వట్లేదని, అన్నీ సీఎం కేసీఆరే అయ్యారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News

Telangana
KCR
Chief Minister
MLA
Tatikonda Rajaiah