సమంతకు కళ్లు తిరిగే భరణం చెల్లించనున్న చైతన్య.. జోరుగా ఊహాగానాలు
- సమంతకు రూ. 300 కోట్లు చెల్లించబోతున్నారంటూ వార్తలు
- కాదు.. రూ. 50 కోట్లేనంటున్న మరికొందరు
- ఇద్దరి మధ్య చిచ్చుపెట్టిన ’ఫ్యామిలీ మ్యాన్ 2 ’ సినిమా?
విడాకులు తీసుకున్నట్టు ఇద్దరూ అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడు భరణం అంశం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఊహాగానాల ప్రకారం.. సమంతకు రూ. 250 కోట్ల నుంచి రూ. రూ. 300 కోట్ల వరకు భరణం లభించే అవకాశం ఉంది. అయితే, కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు. గరిష్ఠంగా రూ. 50 కోట్లు మాత్రమే చెల్లించే అవకాశం ఉందంటున్నారు. అయితే, ఈ విషయంలో అటు అక్కినేని ఫ్యామిలీ నుంచి కానీ, సమంత నుంచి కానీ ఎలాంటి ప్రకటన లేదు. వారు స్పందించే వరకు భరణం అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది.