ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘించి.. విమాన విధ్వంసక క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా
- గత కొన్ని వారాల్లోనే ఇది నాలుగోసారి
- విభిన్నమైన అస్త్రాన్ని ఏదో పరీక్షించి ఉంటుందని భావిస్తున్న దక్షిణ కొరియా
- అంతర్జాతీయ ఆంక్షల నుంచి బయటపడేందుకేనంటున్న నిపుణులు
నిజానికి ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాన్ని చేపట్టకూడదు. కానీ వీటిని తోసి రాజని ఉత్తర కొరియా మిసైల్‌ను పరీక్షించింది. ఈ పరీక్ష వెనక అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం పొందే వ్యూహం దాగి ఉందని భావిస్తున్నారు. ఉత్తర కొరియా ఏదో విభిన్నమైన అస్త్రాన్ని పరీక్షించి ఉంటుందని దక్షిణ కొరియా, జపాన్, అమెరికా భావిస్తున్నాయి.