ఏపీలో కొత్తగా 1,084 కరోనా కేసులు
- అత్యధికంగా తూ.గో. జిల్లాలో 244 కేసులు
- రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృతి
- రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 11,655
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,49,314కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 20,23,496 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి 14,163 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,655 యాక్టివ్ కేసులు ఉన్నాయి.