త‌న కుటుంబ స‌భ్యులంద‌రితో క‌లిసి ప్రభాస్ ఫొటో.. వైర‌ల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త‌న కుటుంబ స‌భ్యులంద‌రితో క‌లిసి ప్రభాస్ ఫొటో.. వైర‌ల్

prabhas pic goes viral
  • పోస్ట్ చేసిన కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి
  • అభిమానులను ఆక‌ట్టుకుంటోన్న ఫొటో
  • 'జ‌గమంత కుటుంబం' అంటూ నెటిజ‌న్ల కామెంట్లు
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ త‌న కుటుంబ స‌భ్యులంద‌రితో క‌లిసి దిగిన ఓ ఫొటో వైర‌ల్ అవుతోంది. రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు భార్య  శ్యామలాదేవి త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. కృష్ణంరాజు సహా వారి కుటుంబానికి చెందిన చాలా మంది ఇందులో వున్నారు.

రెబ‌ల్ స్టార్ కుటుంబమంతా ఒకే చోట చేరి ఫొటో దిగ‌డంతో అభిమానుల‌ను ఈ ఫొటో బాగా అల‌రిస్తోంది. గ‌తంలో ప్ర‌భాస్ న‌టించిన 'చ‌క్రం' సినిమాలోని 'జ‌గ‌మంత కుటుంబం నాది' పాట‌ను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. బాహుబ‌లి, సాహో సినిమాల త‌ర్వాత‌ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధే శ్యామ్, స‌లార్, ఆదిపురుష్ సినిమాల్లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.
    
Prabhas
Viral Pics
Tollywood

More Telugu News