రూ. 6 లక్షల విలువైన బ్లూటూత్ చెప్పులు ధరించి హైటెక్ కాపీయింగ్‌కు యత్నం.. ఐదుగురికి అరదండాలు
- 31 వేల టీచర్ పోస్టులకు ఆర్ఈఈటీ నిర్వహించిన రాజస్థాన్ ప్రభుత్వం
- మొత్తం 25 మందికి చెప్పులు విక్రయించిన ముఠా
- గ్యాంగ్ లీడర్ కోసం గాలింపు
ఈ పరీక్షకు హాజరైన ముగ్గురు అభ్యర్థులు బ్లూటూత్ అమర్చిన 6 లక్షల రూపాయల విలువైన చెప్పులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. బికనీర్‌లోని గంగాషహర్ ప్రాంతంలోని నయా బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ హైటెక్ కాపీయింగ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. వారిచ్చిన సమాచారంతో పరీక్ష రాసేందుకు వచ్చిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఓ ముఠా నుంచి వీరు రూ. 6 లక్షల చొప్పున బ్లూటూత్ చెప్పులను కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. వివిధ జిల్లాలకు చెందిన 25 మందికి ఈ ముఠా బ్లూటూత్ చెప్పులు విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న గ్యాంగ్ లీడర్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.