మమతా బెనర్జీ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
- భవానీపూర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బెంగాల్ సీఎం
- బుధవారం గురుద్వారాను దర్శించిన మమత
- భారీగా తరలివచ్చిన అభిమానులు
- ఈసీకి లేఖ రాసిన బీజేపీ వర్గాలు
దీంతో ఆమె కరోనా నిబంధనలు ఉల్లంఘించారని బీజేపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సజల్ ఘోష్ ఆరోపించారు. ‘‘సెప్టెంబరు 15న భవానీపుర్ గురుద్వారాను సందర్శించే సమయంలో టీఎంసీ అభ్యర్థి కరోనా నిబంధనలు ఉల్లంఘించారు’’ అంటూ ఎన్నికల సంఘానికి సజల్ ఘోష్ లేఖ రాశారు. అలాగే మమత వెంట వచ్చిన కార్యకర్తలు కూడా మాస్కులు ధరించకుండా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ మేరకు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి లేఖ రాశారు.
అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలని, రాజకీయ లబ్ధి కోసం చెబుతున్న అబద్ధాలని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది.