భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్.. కరోనాను సమర్థంగా అడ్డుకుంటున్న చుక్కల మందు!
- కరోనా వైరస్ నివారణకు భారత్ బయోటెక్ నుంచి చుక్కల మందు
- తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు
- రెండు, మూడు దశలకు రెడీ అవుతున్న భారత్ బయోటెక్
- త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న నీతి ఆయోగ్
కరోనా వైరస్ ముక్కు నుంచే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి గొంతు, ఆపై ఊపిరితిత్తుల్లోకి విస్తరిస్తుంది. కాబట్టి ముక్కు ద్వారా వేసే ఈ చుక్కల టీకా అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నాసల్ టీకాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.