భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం.. పలు ప్రాంతాలు జలమయం
- గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయి వానలు
- ఈ తెల్లవారుజామున కుండపోత
- నదులను తలపిస్తున్న రహదారులు
- లోతట్టు ప్రాంతాల మునక
భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అండర్ పాస్ వంతెన వద్ద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. మరోపక్క, రాగల 12 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.