‘బిగ్‌బాస్’తో విష సంస్కృతి.. వెంటనే నిలిపేయండి: సీపీఐ నారాయణ
- బిగ్‌బాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నారాయణ
- అదో బూతుల ప్రపంచమని, వేల కోట్ల రూపాయలకు ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం
- న్యాయవ్యవస్థ, పోలీసులు తనకు సాయం చేయడం లేదని ఆవేదన
బిగ్‌బాస్ షోకు అనుమతి నివ్వడం చాలా ఘోరమైన విషయమన్నారు. ఈ షో అనైతికమన్నారు. దీనిని ఆపాలంటూ తాను కోర్టుల్లో కేసులు వేసినా న్యాయవ్యవస్థ కానీ, పోలీసులు కానీ తనకు సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఇలాంటి దారుణ షోలకు అనుమతినివ్వడం మానుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.