బాక్సింగ్ వ్యాఖ్యాతగా ట్రంప్.. కుమారుడితో కలిసి కామెంటరీ
- ఇవాండర్ హోలీ ఫీల్డ్, విక్టర్ బెల్‌ఫోర్డ్ మధ్య మ్యాచ్
- ఫ్లోరిడాలోని హాలీవుడ్ ఎరీనా వేదిక
- చూడాలంటే 49.9 డాలర్లు చెల్లించాల్సిందే
హెవీవెయిట్ మాజీ ఛాంపియన్ ఇవాండర్ హోలీ ఫీల్డ్, యూఎఫ్‌సీ మాజీ ఛాంపియన్ విక్టర్ బెల్‌ఫోర్ట్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఫ్లోరిడాలోని హాలీవుడ్ ఎరీనా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనికోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
ఈ క్రమంలో తను వ్యాఖ్యాతగా ఉన్న ఈ మ్యాచ్‌ను ఎవరూ మిస్ కావొద్దంటూ ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. దీన్ని 'పే ఫర్ వ్యూ' విధానంలో FITE.TVలో ప్రసారం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ చూడాలంటే మాత్రం 49.9 డాలర్లు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. బాక్సింగ్ రంగంలో దిగ్గజాలు పోటీ పడే ఈ మ్యాచ్ కోసం అమెరికన్లు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
కాగా, బాక్సింగ్‌తో ట్రంప్‌కు బాగానే అనుబంధం ఉంది. గతంలో కొంతకాలం ఆయన కొన్ని బాక్సింగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చారు. వీటిలో చాలావరకూ అట్లాంటిక్ సిటీలో ఉన్న ట్రంప్ సొంత కేసినోలోనే జరిగేవి.