Pavan Kalyan: పవన్ సినిమా నుంచి రేపు పవర్ ప్యాక్డ్ ఎనౌన్స్ మెంట్!

  • పవన్ తో హరీశ్ శంకర్ మూవీ
  • ఇప్పటికే పూర్తయిన కసరత్తు
  • కథానాయికగా తెరపైకి పూజ హెగ్డే పేరు
  • పరిశీలనలో 'భవదీయుడు భగత్ సింగ్' టైటిల్  
  • రేపు రానున్న క్లారిటీ      
Harish Shankar and Pavan Kalyan movie update

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ వస్తున్నాయి. పవన్ పుట్టిన రోజున ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ ను వదిలారు. ఆ తరువాత దర్శక నిర్మాతలు రీసెంట్ గా పవన్ ను కలిసి మాట్లాడారు.

ఈ సినిమా నుంచి రేపు ఉదయం 9:45 నిమిషాలకు పవర్ ప్యాక్డ్ ఎనౌన్స్ మెంట్ ఒకటి ఉంటుందని తాజాగా ఒక ప్రకటన ఇచ్చారు. మరి రేపటి ఎనౌన్స్ మెంట్ ద్వారా ఏయే విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నారో చూడాలి. ఈ సినిమాకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, పవన్ జోడీగా పూజ హెగ్డే అలరించనుందనే టాక్ వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి, ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. వచ్చేనెల నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు. 

More Telugu News