తెలంగాణలో మరో 301 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 67,720 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 70 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 5,505 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,59,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,50,453 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,505 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,886కి పెరిగింది.
