అల్లు అర్జున్ కి జంటగా మరోసారి పూజ హెగ్డే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు అర్జున్ కి జంటగా మరోసారి పూజ హెగ్డే!

Pooja Hegde in Allu Arjun movie
  • స్టార్ హీరోలతో సినిమాలు
  • వరుసగా వచ్చిపడుతున్న హిట్లు
  • 'ఐకాన్' కోసం తెరపైకి ఆమె పేరు
  • పవన్ మూవీలోను ఛాన్స్ అంటూ టాక్
పూజ హెగ్డేను చూస్తుంటే అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా పుష్కలంగా ఉందనిపిస్తోంది. మెగా హీరోల సరసన ఆమెకు వరుస అవకాశాలు పడుతుండటమే అందుకు నిదర్శనం. వరుణ్ తేజ్ జోడిగా 'ముకుంద' .. 'గద్దలకొండ గణేశ్' చేసిన ఆమె, ఆ తరువాత బన్నీ జోడీగా కూడా రెండు సినిమాలు చేసింది.

'దువ్వాడ జగన్నాథం' .. 'అల వైకుంఠపురములో' సినిమాలు రెండు కూడా భారీ విజయాలను నమోదు చేశాయి. తాజాగా ఆమె చరణ్ సరసన నాయికగా 'ఆచార్య' చేసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆమె బన్నీతో జోడీ కట్టనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ 'ఐకాన్' సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాయిక పాత్ర కోసం పూజ హెగ్డేను సంప్రదిస్తున్నారట. ఇక పవన్ - హరీశ్ సినిమా కోసం కూడా ఈ సుందరి పేరే వినిపిస్తూ ఉండటం విశేషం.  
Allu Arjun
Pooja Hegde
Venu Sri Ram

More Telugu News