టీచర్స్ డే సందర్భంగా ఆసక్తికరమైన ఫొటో పంచుకున్న మహేశ్ బాబు
- నేడు గురు పూజ్యోత్సవం
- తండ్రే తన గురువన్న మహేశ్ బాబు
- అనేక విషయాలు నేర్చుకున్నానని వెల్లడి
- తోడ్పాటు అందించిన వారికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్
దీనిపై మహేశ్ బాబు స్పందిస్తూ... ఇతరుల పట్ల ప్రేమగా ఉండడం, దృఢమైన వ్యక్తిత్వం, క్రమశిక్షణ, కరుణ, వినయం కలిగి ఉండడం వంటి అంశాలను తన తండ్రి ద్వారానే నేర్చుకున్నానని వెల్లడించారు. అందుకు తన తండ్రికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన జీవితంలో అనేక అంశాలు నేర్చుకోవడంలోనూ, వ్యక్తిత్వ పరిణామ క్రమంలోనూ తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని మహేశ్ బాబు వివరించారు.