భావోద్వేగభ‌రిత వ్యాఖ్య‌లు చేస్తూ క‌న్నీరు పెట్టిన ఎమ్మెల్యే రోజా.. వీడియో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భావోద్వేగభ‌రిత వ్యాఖ్య‌లు చేస్తూ క‌న్నీరు పెట్టిన ఎమ్మెల్యే రోజా.. వీడియో ఇదిగో

roja breaks down
  • వినాయక చవితి టీవీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రోజా
  • 1991లో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాన‌ని వ్యాఖ్య‌
  • 2002 వరకు కష్టపడి సంపాదించిన‌ మొత్తాన్ని అప్పులకే కట్టానన్న ఎమ్మెల్యే
  • త‌న‌కు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారన్న రోజా
  • పెళ్లైన ఏడాదికే అన్షు పుట్టిందని వివ‌ర‌ణ‌
'జ‌బ‌ర్ద‌స్త్' వంటి కార్య‌క్ర‌మాల్లో న‌వ్వుతూ, అంద‌రినీ న‌వ్వించే వైసీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో క‌న్నీరు పెట్టుకుని అంద‌రితో కంట‌త‌డి పెట్టించారు. గ‌తంలో తాను అనుభ‌వించిన క‌ష్టాల‌ను గురించి చెప్పారు.  వినాయక చవితి సందర్భంగా మ‌ల్లెమాల సంస్థ రూపొందిస్తోన్న 'ఊరిలో వినాయకుడు' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన ప్రొమోను ఆ సంస్థ యూట్యూబ్ చానెల్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆమె భావోద్వేగభ‌రిత వ్యాఖ్య‌లు చేశారు. తాను 1991లో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాన‌ని చెప్పారు. 2002 వరకు కష్టపడి సంపాదించిన‌ మొత్తాన్ని అప్పులకే కట్టానని తెలిపారు.

పెళ్లి చేసుకునే ముందు త‌నకు ఆరోగ్య‌ సమస్య ఉండేద‌ని, త‌న‌కు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారని వివ‌రించారు. అయితే, పెళ్లైన త‌ర్వాత గ‌ర్భ‌వ‌తి అయ్యాన‌ని, ఏడాదికే అన్షు పుట్టిందని చెప్పారు. అందుకే అన్షు అంటే త‌న‌కు చాలా ఇష్టమ‌ని తెలిపారు. వినాయ‌క చ‌వితి రోజున‌ ఈటీవీలో ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంది.

    
Roja
Tollywood
YSRCP

More Telugu News