Pawan Kalyan: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ విడుదల.. పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్

Pawan Kalyan Bheemla Nayak Title song released
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబరు 2న ఆ అభిమానులు హుషారెత్తిపోతారు. వీరిని మరింత హుషారెక్కించేందుకు ‘భీమ్లా నాయక్’ చిత్ర బృందం రెడీ అయిపోయింది. పవర్ స్టార్ బర్త్‌డే రోజున అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ అందించింది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది.

ఈ పాటకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి దీనిని రాశారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నాడు ఈ పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) ట్వీట్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట వీడియోలో థమన్, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిరియాల తదితరులు కనిపిస్తున్నారు. పవర్ స్టార్ రేంజ్ చెప్పేలా ఉన్న ఈ పాటను విన్న అభిమానులు సంతోషంతో ఎగిరి గంతులేస్తున్నారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం చిత్రాన్ని తెలుగులో ‘భీమ్లా నాయక్’ పేరిట పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తోపాటు రానా దగ్గుబాటి, నిత్యమీనన్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Bheemla Nayak
Tollywood
Rana Daggubati
Nithya Menen
Aishwarya Rajesh

More Telugu News