'తుగ్లక్ దర్బార్' నుంచి ట్రైలర్ రిలీజ్!
Add ap7am to your home Screen

'తుగ్లక్ దర్బార్' నుంచి ట్రైలర్ రిలీజ్!

Tughlaq Durbar trailer released
  • రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ
  • కీలకపాత్రల్లో సత్యరాజ్ - పార్తీబన్
  • కథానాయికగా రాశి ఖన్నా
  • వచ్చేనెల 10వ తేదీన విడుదల
తమిళనాట విజయ్ సేతుపతికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనకి అక్కడ మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఒకే భాషలో ఇటు హీరోగా .. అటు విలన్ గా చేయడం బాహుశా విజయ్ సేతుపతికి మాత్రమే చెల్లిందేమో. ఇక ఇటీవల కాలంలో ఆయన ఇతర భాషల్లోను తన పాప్యులారిటీ పెంచుకున్నాడు.

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'తుగ్లక్ దర్బార్' సిద్ధమవుతోంది. ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ సేతుపతి సరసన నాయికగా రాశి ఖన్నా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇది రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. సామాన్యుడైన కథానాయకుడు రాజకీయనాయకుడిగా ఎలా ఎదిగాడనేదే కథ. సత్యరాజ్ .. పార్తీబన్ ... మంజిమా మోహన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vijay Sethupathi

More Telugu News