విజయ్ సేతుపతి 'లాభం' రిలీజ్ డేట్ ఖరారు!
Add ap7am to your home Screen

విజయ్ సేతుపతి 'లాభం' రిలీజ్ డేట్ ఖరారు!

Laabam movie release date confirmed
  • విజయ్ సేతుపతి నుంచి 'లాభం'
  • తెలుగులో 'లాభం' టైటిల్ ఖరారు
  • రెండు భాషల్లో వచ్చేనెల 9న రిలీజ్
  • కథానాయికగా శ్రుతి హాసన్  
విజయ్ సేతుపతి - శ్రుతిహాసన్ జంటగా తమిళంలో 'లాభం' సినిమా రూపొందింది. ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలుగులో 'లాభం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయనున్నారు.

ఒకేసారి తమిళ .. తెలుగు భాషల్లో విడుదలవుతున్న విజయ్ సేతుపతి ఫస్టుమూవీ ఇదేనని అంటున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలో, జగపతిబాబు .. సాయిధన్సిక కీలకమైన పాత్రలను పోషించారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో కలైయరసన్ .. రమేశ్ తిలక్ కనిపించనున్నారు.

ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ తమిళనాట తన జోరును కొనసాగించాలనే ఉద్దేశంతో శ్రుతిహాసన్ ఉంది. 'మాస్టర్' అనువాదం ద్వారా .. 'ఉప్పెన' సినిమా ద్వారా తెలుగులో క్రేజ్ పెంచుకున్న విజయ్ సేతుపతికి హిట్ పడుతుందేమో చూడాలి.
Vijay Sethupathi
Sruthi Haasan
jagapathi Babu

More Telugu News