ఆయ‌న‌ను అభిమానించి, ఆరాధించే అభిమానుల్లో నేను తొలి అభిమానిని: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
Add ap7am to your home Screen

ఆయ‌న‌ను అభిమానించి, ఆరాధించే అభిమానుల్లో నేను తొలి అభిమానిని: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

pawan wishes chiru
  • చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు
  • నాకే కాకుండా ఎందరికో మార్గదర్శి
  • ఆయ‌న‌ తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టం
  • చిరులోని సుగుణాలను  చూస్తూ పెరగడం మరో అదృష్టం
మెగాస్టార్ చిరంజీవికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి త‌న‌కే కాకుండా ఎందరికో మార్గదర్శి అని ఆయ‌న చెప్పారు. ఆయన తమ్ముడిగా తాను పుట్టడం ఒక అదృష్టమ‌ని, అంతేగాక చిరులోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టమ‌ని ప‌వ‌న్ అన్నారు.

చిరంజీవిని అభిమానించి, ఆరాధించే లక్షలాదిమందిలో తాను తొలి అభిమానినని ఆయ‌న చెప్పారు. చిరంజీవిని చూస్తూ, ఆయన సినిమాలను వీక్షిస్తూ, ఆయన ఉన్నతిని కనులారా చూశానని తెలుపుతూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చిరంజీవిలోని అద్భుత లక్షణమ‌ని ఆయ‌న చెప్పారు.

విజయాలు ఎన్ని సాధించినప్ప‌టికీ, ఎన్ని రికార్డులు సృష్టించినప్ప‌టికీ ఆయ‌న‌లో అదే విధేయత, వినమ్రత ఉంటాయ‌ని చెప్పారు. అందువల్లే చిరంజీవిని ల‌క్ష‌లాది మంది సొంత మనిషిలా భావిస్తారని చెప్పారు. చిరంజీవి త‌మ కుటుంబంలో అన్నగా పుట్టినా త‌మ‌ని తండ్రిలా పెంచార‌ని ఆయ‌న తెలిపారు.

             
Chiranjeevi
Pawan Kalyan
Tollywood

More Telugu News