చైనాలో ముగ్గురు పిల్లల్ని కనేందుకు గ్రీన్ సిగ్నల్.. సవరణ చట్టానికి పార్లమెంటు ఆమోదం
- దేశంలో దారుణంగా పడిపోతున్న జననాల రేటు
- పెరుగుతున్న ఖర్చుల కారణంగా అధిక సంతానానికి దంపతుల విముఖత
- ఖర్చులు తగ్గించి వెసులుబాటు కల్పించడమే లక్ష్యంగా తాజా ప్రతిపాదన
పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో అధిక సంతానానికి ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా ప్రతిపాదన తీసుకొచ్చింది. కుటుంబాలపై పడే భారం, పిల్లలను పెంచేందుకు, చదువుకు అయ్యే వ్యయాలను తగ్గించడంతోపాటు ఆర్థిక సాయం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. కాగా, ఈ ఏడాది మేలో ఇద్దరు పిల్లల విధానాన్ని సడలించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి నిచ్చింది.