Prakash Raj: 485 కి.మీటర్ల పాదయాత్ర చేప‌ట్టిన అభిమాని.. వీడియో పోస్ట్ చేసి వ‌ద్ద‌ని చెప్పిన ప్ర‌కాశ్ రాజ్‌!

prakash raj tweets about fan padayatra
షార్ట్స్‌లో చూడండి
త‌న కోసం ఓ అభిమాని చేస్తోన్న పాద‌యాత్ర గురించి తెలుసుకుని సినీన‌టుడు ప్రకాశ్‌ రాజ్ చ‌లించిపోయారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల్లో  ప్రకాశ్‌ రాజ్ కూడా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌కాశ్ రాజ్ గెల‌వాల‌ని కోరుకుంటూ తూర్పుగోదావరి జిల్లా  కోలమూరు ప్రాంతం నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు రంజిత్ కుమార్ అనే అభిమాని పాద‌యాత్ర చేస్తున్నాడు.

రంజిత్ కుమార్  సినీ ప‌రిశ్ర‌మ‌లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గానూ పనిచేస్తున్నాడు. అత‌డు దాదాపు 485 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడంతో దీనిపై ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు. రంజిత్ లాంటి నిస్వార్థంతో కూడిన వారి అభిమానమే ఆర్టిస్టుగా త‌న‌ను ముందుకు నడిపిస్తోందని ఆయ‌న చెప్పారు.

అయితే, పాద్రయాత్ర చేస్తోన్న తీరు త‌న‌ మనసుకు బాధ కలిగిస్తోందని అన్నారు. త‌న‌ మాట విని తిరిగి రంజిత్‌ ఇంటికి వెళ్లి ఆనందంగా జీవించాల‌ని అన్నారు. త్వరలో రంజిత్‌ను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతానని ప్రకాశ్‌ రాజ్ అన్నారు. పాద‌యాత్ర‌ను విర‌మించుకోవాల‌ని సూచించారు.
Go Back to Shorts
Prakash Raj
Tollywood
MAA

More Telugu News