రేపు శ్రీశైలంకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్ షా
- ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా
- బేగంపేట నుంచి హెలికాప్టర్ లో శ్రీశైలంకు పయనం
- అనంతరం తిరిగి హైదరాబాదు నుంచి ఢిల్లీకి ప్రయాణం
దర్శనానంతరం శ్రీశైలంలోని గెస్ట్ హౌస్ లో ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు ఆయన చేరుకుంటారు. ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. అయితే, అమిత్ షా పర్యటనలో రాజకీయపరమైన ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడం గమనార్హం.