ఇ.రజనీకి 25 లక్షలు, వెయ్యి గజాల నివాస స్థలం ఇవ్వాలని జగన్ ఆదేశం
- టోక్యో ఒలింపిక్స్ లో ప్రతిభ కనబరిచిన హాకీ ప్లేయర్ రజనీ
- ఈరోజు జగన్ ను కలిసిన రజనీ
- శాలువా కప్పి సత్కరించిన ముఖ్యమంత్రి
రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. ఒలింపిక్స్ లో పాల్గొన్న ఏకైక దక్షిణాది క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందారు. 2016 రియో ఒలింపిక్స్ లో కూడా ఆమె పాల్గొన్నారు. భారత్ తరపున 110 అంతర్జాతీయ మ్యాచ్ లలో ఆమె ఆడారు. గోల్ కీపర్ గా మంచి ప్రతిభను కనబరిచారు.