తెలంగాణలో కొత్తగా 453 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 80,658 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 68 కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 8,242 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,49,859 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,37,789 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,242 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,828కి చేరింది.
