సాంకేతిక కారణాలతో 5 గంటలు నిలిచిపోనున్న 108 కాల్ సెంటర్ సేవలు
రాష్ట్రంలో 108 సేవలకు కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఏపీలో సాంకేతిక కారణాలతో 108 కాల్ సెంటర్ సేవలు 5 గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఈ రాత్రి ఒంటిగంట నుంచి 108 సేవలు నిలిచిపోనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 08645660208, 8331033405కి కాల్ చేయాలని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.