సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Regina in Chatrapati Hindi remake
  • హిందీ 'ఛత్రపతి'లో నాయికగా రెజీనా!
  • చిరంజీవి మరోసారి ద్విపాత్రాభినయం?
  • 'హరిహర వీరమల్లు' తాజా షెడ్యూలు      
*  గతంలో 'ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా' అనే హిందీ చిత్రంలో నటించిన దక్షిణాది తార రెజీనా త్వరలో మరో హిందీ చిత్రంలో చేయనుంది. 'ఛత్రపతి' చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు రెజీనాను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.
*  మెగాస్టార్ చిరంజీవి మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో మెగాస్టార్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రలు పోషించనున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.
*  పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' పేరిట పిరీడ్ ఫిలిం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తాజా షెడ్యూలును వచ్చే నెల మొదటి వారం నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Go Back to Shorts
Regina
Chiranjeevi
Pawan Kalyan
Nidhi Agarwal

More Telugu News