క‌రోనా చైనా ల్యాబ్‌లోనే పుట్టింద‌న్న వాద‌న‌ను కొట్టిపారేయ‌లేం: డబ్ల్యూహెచ్‌వో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క‌రోనా చైనా ల్యాబ్‌లోనే పుట్టింద‌న్న వాద‌న‌ను కొట్టిపారేయ‌లేం: డబ్ల్యూహెచ్‌వో

WHO chief scintist  about COVID 19 origin
  • ఆ వైర‌స్ ఎక్కడ పుట్టిందన్న అంశంపై పరిశోధన కొన‌సాగుతోంది
  • దీనిపై చైనా మరింత పారదర్శకంగా వ్యవహరించాలి
  • కరోనా వెలుగులోకి వ‌చ్చిన రోజుల‌ నాటి సమాచారం ఇవ్వాలి
  • కొన్ని ల్యాబ్‌ల్లో ప్రమాదాలు జరగడం సాధారణమే
క‌రోనా వైర‌స్ చైనా ల్యాబ్‌లోనే పుట్టింద‌ని ప్ర‌పంచంలోని ప‌లు దేశాలు ఆరోప‌ణ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై మొద‌టి నుంచి భిన్నంగా స్పందిస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అథనామ్‌ ఇప్పుడు ఆ వాద‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికేలా వ్యాఖ్య‌లు చేశారు. కరోనా పుట్టుక‌కు, అది ల్యాబ్‌ నుంచి లీక్‌ కావడానికి మధ్య ఎటువంటి సంబంధమూ లేదని ఎవరైనా కొట్టిపారేస్తే అది తొందరపాటే అవుతుందని ఆయ‌న అన్నారు.

ఆ వైర‌స్ ఎక్కడ పుట్టిందన్న అంశంపై పరిశోధన కొన‌సాగుతోందని తెలిపారు. దీనిపై మరింత పారదర్శకంగా వ్యవహరించాలని చైనా ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వెలుగులోకి వ‌చ్చిన రోజుల‌ నాటి సమాచారం ఇవ్వాల‌ని అన్నారు. వూహాన్‌ ల్యాబ్‌ నుంచే ఆ వైరస్‌ లీక్‌ అయినట్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నమ్ముతున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు.

తాను కూడా ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేశాన‌ని, తాను ఇమ్యునాలజిస్టును అని చెప్పారు. కొన్ని ల్యాబ్‌ల్లో ప్రమాదాలు జరుగుతుండ‌డం సాధారణమేన‌ని చెప్పారు. అలాగే, కరోనా మూడో ద‌శ విజృంభ‌ణ ప్రారంభ దశలో ప్రపంచం ఉందని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 100కు పైగా దేశాల్లో డెల్టా వేరియంట్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయన్నారు.
WHO
Corona Virus
COVID19

More Telugu News