భారీ నష్టాల్లో హైదరాబాద్ మెట్రో రైల్.. ఆదుకోమంటున్న ఎల్ అండ్ టీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ నష్టాల్లో హైదరాబాద్ మెట్రో రైల్.. ఆదుకోమంటున్న ఎల్ అండ్ టీ!

Hyderabad Metro Rail in losses
  • మెట్రో రైల్ పై కరోనా పంజా
  • రోజుకు రూ. 5 కోట్ల నష్టం
  • ఈ ఆర్థిక సంవత్సరం చివరకు రూ. 1,500 కోట్లకు చేరనున్న నష్టాలు
కరోనా దెబ్బకు హైదరాబాద్ మెట్రో రైల్ విలవిల్లాడుతోంది. భారీ నష్టాల్లో కూరుకుపోయింది. కోవిడ్ నిబంధనలు, లాక్ డౌన్లు, కరోనా నేపథ్యంలో ప్రయాణికులు తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం వంటి కారణాలు మెట్రో రైలును భారీ నష్టాల్లోకి తీసుకెళ్లాయి.

వాస్తవానికి హైదరాబాదులో మెట్రో రైలు ప్రారంభమైన తొలి రోజు నుంచే విపరీతమైన ప్రజాదరణ పొందింది. రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దాంతో తొలి సంవత్సరాలలో మంచి లాభాలనే సాధించింది. అయితే కరోనా రాకతో మెట్రో లాభాలు పట్టాలు తప్పాయి. ప్రతి రోజు సగటున రూ. 5 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. ప్రతి రోజు కేవలం రూ. కోటి మాత్రమే ఆదాయం వస్తోందట.
 
ఈ నేపథ్యంలో ఇటీవల మెట్రో రైల్ నిర్వాహకులైన ఎల్ అండ్ టీ అధికారులు సీఎం కేసీఆర్ ను కలిశారు. నష్టాల్లో కూరుకుపోయిన మెట్రో రైల్ ను ఆదుకోవాలని కోరారు. దీంతో రాయితీ ఒప్పందం ప్రకారం ఏం చేయవచ్చనే దానిపై నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయం, మెట్రో రైల్ కార్యాలయాన్ని కేసీఆర్ కోరారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మెట్రో రైల్ రూ. 400 కోట్ల నష్టాన్ని చవిచూసిందట. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నష్టాలు రూ. 1,500 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని మెట్రో రైల్ అధికారులు సీఎంని కోరారు.
Hyderabad
Metro Rail
Loss

More Telugu News