అక్రమ విద్యుత్ కనెక్షన్ ను కత్తిరిస్తూ ఇలా దొరికిపోయాడు... వీడియో ఇదిగో!
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- అక్రమ కనెక్షన్ దారులపై అధికారుల కొరడా
- తనిఖీలు చేపట్టిన వైనం
- కెమెరాకు దొరికిపోయిన వ్యక్తి
ఈ క్రమంలో ఇక్కడి మురాద్ నగర్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆసక్తికర సంఘటన జరిగింది. అధికారులు వస్తున్నారని తెలిసి, ఓ వ్యక్తి తన ఇంటిపై ఉన్న అక్రమ కనెక్షన్ ను తొలగించేందుకు బల్లిలా పాక్కుంటూ కనెక్షన్ వద్దకు వచ్చాడు. అయితే ఇదంతా సెల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేశారు. కెమెరాను చూసి అతగాడు గతుక్కుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.