పెన్నా కేసులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన సీఎం జగన్

CM Jagan files discharge petition
  • సీఎం జగన్ పై అక్రమాస్తుల కేసు
  • సీబీఐ కోర్టులో నేడు విచారణ
  • పెన్నా చార్చిషీట్ నుంచి తనను తప్పించాలన్న జగన్
  • ఇదే కేసులో డిశ్చార్జి కోరిన సబిత, తదితరులు
సీబీఐ కోర్టులో నేడు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా కేసులో సీఎం జగన్, తదితరులు డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా చార్జిషీట్ నుంచి తన పేరు తొలగించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అటు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా చార్జిషీటు నుంచి తనను తొలగించాలని ఆమె కోరారు. సబిత డిశ్చార్జి పిటిషన్ పై కౌంటరుకు సీబీఐ అధికారులు గడువు కోరారు. సబిత డిశ్చార్జి పిటిషన్ పై తదుపరి విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 22కి వాయిదా వేసింది.

ఇక, ఇతర నిందితులు రాజగోపాల్, శామ్యూల్ కూడా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేయగా, విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్ కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.
Go Back to Shorts
CM Jagan
Discharge Petition
Penna Charge Sheet
CBI Court

More Telugu News