రేపు తెలంగాణ‌ కేబినెట్ భేటీ.. 50 వేల ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదముద్ర వేసే అవ‌కాశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు తెలంగాణ‌ కేబినెట్ భేటీ.. 50 వేల ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదముద్ర వేసే అవ‌కాశం

telangana cabinet meets tomorrow
  • అన్ని ఏర్పాట్లు పూర్తి
  • శాఖల వారీగా వివ‌రాలు సేక‌రించిన‌ అధికారులు
  • త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ విడుద‌ల‌?
  • ఉద్యోగుల‌ పదోన్నతులపైనా రేపు నిర్ణయం
తెలంగాణ‌లో కొత్త జోన్ల వ్యవస్థ‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉద్యోగాల భ‌ర్తీకి మార్గం సుగ‌మం కావ‌డంతో యాభైవేల ఉద్యోగాల భర్తీ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. రేపు జరిగే ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర‌ మంత్రి వర్గ సమావేశం జ‌ర‌గ‌నుంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెల‌ప‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ మేరకు శాఖల వారీగా అధికారులు ఖాళీల వివరాలు సేక‌రించారు. వాటికి కేబినెట్ ఆమోద ముద్ర వేయ‌డంతో పాటు ఉద్యోగుల‌ పదోన్నతులపైనా నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని 32 శాఖల్లో ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు. కేబినెట్ ఆమోదం తరువాత రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త జోన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.
Telangana
Telangana Cabinet
KCR

More Telugu News