వనపర్తి జిల్లా తాడిపత్రిలో రేపు షర్మిల నిరాహార దీక్ష

Sharmila will go on a hunger strike in Tadipatri Vanaparthi district tomorrow
  • తొలి నుంచి నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తుతున్న షర్మిల
  • రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్ష
  • హాజరు కానున్న నిరుద్యోగులు, విద్యార్థులు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల రేపు వనపర్తి జిల్లాలోని తాడపత్రి గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తొలి నుంచి నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తుతున్న షర్మిల రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ‘నిరుద్యోగ నిరాహారదీక్ష’ చేపడతారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. షర్మిల చేపట్టనున్న ఈ నిరాహార దీక్షకు ఆ పార్టీ నేతలతోపాటు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరవుతారని ఆయన తెలిపారు. కాగా, షర్మిల మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రకటించి జెండాను ఆవిష్కరించారు.
Go Back to Shorts
YTP
Telangana
YS Sharmila
Wanaparthy District

More Telugu News