వరద నీటిలో.. పడవులలో పెళ్లి ఊరేగింపు.. వీడియో వైరల్!
- బీహార్లోని గోబర్సిత్తా గ్రామంలో ఘటన
- నది ఉప్పొంగడంతో వరదలు
- మూడు పడవల్లో పెళ్లి ఊరేగింపు
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వరుణుడు అడ్డుపడాలని చూసినప్పటికీ పెళ్లి కూతురి ఇంటికి మగపెళ్లివారు ఊరేగింపుగా పడవల్లో వచ్చి తమ సంప్రదాయాన్ని నిలబెట్టుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ అవే పడవల్లో పెళ్లి కొడుకు ఇంటికి వివాహ ఊరేగింపును కొనసాగించారు. భారీ వర్షాలకు బాగమతీ నది ఉప్పొంగడంతో ఆ గ్రామం నిండా మోకాళ్లలోతుకుపైగా నీళ్లు నిలిచాయి.