నీటి విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎంతవరకైనా పోరాడుతుంది: మంత్రి ఆదిమూలపు సురేశ్
- మైదుకూరులో వైఎస్సార్ అగ్రిటెస్ట్ ల్యాబ్ ప్రారంభం
- ఏపీ అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత
- దానిని కప్పిపుచ్చుకునేందుకే ప్రాంతీయ విభేదాలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో చేపట్టిన అభివృద్ధి పథకాల వల్ల తెలంగాణ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దానిని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కనపెట్టి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. మన వాటా చివరి బొట్టు అందే వరకు వైసీపీ ప్రభుత్వం ఎంతవరకైనా పోరాడుతుందని మంత్రి స్పష్టం చేశారు.