తన మేకప్ మ్యాన్ కు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు

Mahesh Babu wishes his makeup man Pattabhi on his birthday
  • సుదీర్ఘకాలంగా మహేశ్ కు మేకప్ మ్యాన్ గా పట్టాభి
  • 27 ఏళ్లుగా మహేశ్ బాబుకు ఒకే మేకప్ మ్యాన్
  • ఇవాళ పట్టాభి జన్మదినం
  • ప్రేమాభిమానాలు చాటిన మహేశ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన మేకప్ మ్యాన్ పట్టాభికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రతి ఏడాది పట్టాభి బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేయడం తెలిసిందే. తాజాగా మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించారు.

"నాకు తెలిసినంతవరకు అత్యుత్తమ మేకప్ మ్యాన్ అంటే పట్టాభి. ఆయన సంతోషకర రీతిలో జన్మదినాన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాను. మున్ముందు కూడా ఆయన తన వృత్తిలో మరింత రాణించాలని కోరుకుంటున్నాను. ఆయనపై ఎప్పటికీ ప్రేమాభిమానాలు నిలిచే ఉంటాయి" అని మహేశ్ బాబు పేర్కొన్నారు.

మహేశ్ బాబు తో పట్టాభి అనుబంధం ఇప్పటిదికాదు. గత 27 ఏళ్లుగా మహేశ్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్ గా పట్టాభి కొనసాగుతున్నారు. పట్టాభి లేకుండా తాను కెమెరాను ఫేస్ చేయలేను అని మహేశ్ గతంలో స్వయంగా అన్నారు. మహేశ్ కు పట్టాభి వృత్తి నైపుణ్యంపై ఎంత నమ్మకం ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.
Go Back to Shorts
Mahesh Babu
Pattabhi
Makeup Man
Birthday
Tollywood

More Telugu News