Mammootty: మమ్ముట్టి హీరోగా 'గ్రేట్ శంకర్' .. టీజర్ రిలీజ్!

Great Shankar movie teaser release
షార్ట్స్‌లో చూడండి
మలయాళంలో మమ్ముట్టికి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. 2017లో ఆయన చేసిన సినిమాల్లో 'మాస్టర్ పీస్' భారీ విజయాన్ని సాధించింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించాడు. 'గ్రేట్ శంకర్' టైటిల్ తో ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ టీజర్ ను ఆదిసాయికుమార్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

ఈ సినిమాలో మమ్ముట్టి కాలేజ్ లెక్చరర్ గా కనిపిస్తున్నాడు. రౌడీయిజం .. రాజకీయాలను కాలేజ్ క్యాంపస్ లోకి అడుగుపెట్టనీయని లెక్చరర్ గా ఆయన ఈ సినిమాలో నటించాడు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ .. ఉన్నిముకుందన్ పోలీస్ ఆఫీసర్స్ గా ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో పూనమ్ బజ్వా కనిపించనుంది. దీపక్ దేవ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తెలుగు ఆడియన్స్ కి మమ్ముట్టి బాగా తెలుసు. ఇక ఉన్ని ముకుందన్ కూడా పరిచయమే. వరలక్ష్మీ శరత్ కుమార్ కి ఇటీవల ఇక్కడ క్రేజ్ పెరిగిపోయింది. అందువలన ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేస్తున్నారని అనుకోవచ్చు.

Go Back to Shorts
Mammootty
Varalakshmi Sharath Kumar
Punam Bajwa

More Telugu News