నేను ప్రెగ్నెంట్ కాదు: సింగర్ చిన్నయి
- ఇటీవల ఒక వివాహానికి హాజరైన చిన్మయి
- ఫొటోల్లో బేబీ బంప్ తో ఉన్నట్టు కనిపిస్తున్న గాయని
- చిన్మయి ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
వివరాల్లోకి వెళ్తే ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో చిన్మయి చీరకట్టులో ఉంది. అయితే ఆమె చీర కట్టిన విధానం వల్ల ఆమె బేబీ బంప్ తో ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆమె గర్భవతి అనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై చిన్మయి స్పందించారు. తాను గర్భవతి అనే వార్తలను ఆమె ఖండించారు. తాను గర్భవతిని కాదని చెప్పారు. తాను మడిసార్ ధరించానని... ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయిందని అన్నారు. అయినా తన పర్సనల్ విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు.
ఒకవేళ నేను గర్భవతిని అయినా ఆ విషయాన్ని మీతో పంచుకోవచ్చు లేదా పంచుకోకపోవచ్చు అని చిన్మయి అన్నారు. తమ పిల్లల ఫొటోలను వంద శాతం తాము సోషల్ మీడియాలో పంచుకోబోమని తెలిపింది. తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లను ఇప్పటికైనా ఆపాలని కోరారు.