తెలంగాణలో కొత్తగా 858 మందికి కరోనా

Telangana corona cases
  • గత 24 గంటల్లో 1,08,617 కరోనా టెస్టులు 
  • జీహెచ్ఎంసీ పరిధిలో 107 కేసులు
  • రాష్ట్రంలో 1,175 మందికి కరోనా నయం
  • 9 మంది మృతి
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య గత కొన్నిరోజులుగా 1000కి లోపే నమోదవుతోంది. అదే విధంగా, గడచిన 24 గంటల్లో 1,08,617 కరోనా పరీక్షలు నిర్వహించగా, 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 107 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రెండేసి చొప్పున పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 1,175 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 3,678 మంది కరోనాతో కన్నుమూశారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,25,237 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,08,833 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,726 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది.
Go Back to Shorts
Telangana
Corona Virus
New Cases
Positive Cases
Deaths
Recovery Rate

More Telugu News