Kalyan Ram: ముగింపు దశలో 'బింబిసార'

Bimbisara movie shooting is going to end soon
షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా కల్యాణ్ రామ్ తన ప్రయత్నాలు తాను చేస్తూనే వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'బింబిసార' రూపొందుతోంది. బింబిసారుడి జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. సైలెంట్ గా షూటింగు మొదలుపెట్టుకున్న ఈ సినిమా, ఇప్పటికే  చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మరో 10 శాతం చిత్రీకరణ జరిగితే, షూటింగు పార్టు పూర్తయినట్టేనని అంటున్నారు. ప్రస్తుతం ఆ కాస్త చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

వశిష్ఠ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను, కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. యుద్ధం నేపథ్యంలో రూపొందే సినిమా కావడం వలన భారీగానే ఖర్చు చేస్తున్నారట. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ పట్ల కల్యాణ్ రామ్ పూర్తి సంతృప్తితో ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా రెండు .. మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం నిన్నటివరకు జరిగింది. కానీ ఈ సినిమా ఒక భాగంగానే రానుందని ఇప్పుడు వినిపిస్తోంది. ఇంతవరకూ సాంఘికాలు చేస్తూ వచ్చిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
Go Back to Shorts
Kalyan Ram
Bimbisara Movie
Tollywood

More Telugu News