బాలీవుడ్ మూవీ కోసం నయన్ కి రెట్టింపు పారితోషికం?
- కోలీవుడ్ లో తిరుగులేని స్థానం
- తెలుగులోనూ విపరీతమైన క్రేజ్
- బాలీవుడ్ ఎంట్రీ అంటూ టాక్
కానీ ఇప్పుడు ఆమె హిందీలో చేయడానికి అవకాశాలు ఉన్నాయనే టాక్ మాత్రం కోలీవుడ్ లో వినిపిస్తోంది. షారుక్ ఖాన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఒక బాలీవుడ్ సినిమా చేయడానికి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆలస్యమైంది కానీ, లేదంటే ఈ సినిమా ఈ పాటికి సెట్స్ పైకి వెళ్లేదే. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను అడుగుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకి 4 నుంచి 5 కోట్లు తీసుకుంటోందట. అంతకి రెట్టింపు ఇస్తామని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. మరి, ఈ ముద్దుగుమ్మ ఒప్పుకుంటుందా అనేదే చాలామంది డౌటు!