కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
- తెలంగాణలోని కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాం
- రాహుల్, సోనియా గాంధీ నమ్మకాన్ని నిలబెడతా
- బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే
- పార్టీలో భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కావు
పార్టీలోని సీనియర్లు, పెద్దల సహకారంతో ముందుకు సాగుతానని రేవంత్ పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్లు అయిన జానారెడ్డి, హన్మంతరావు వంటి వారిని కలిసి వారి సలహాలు, సూచనలు, ఆలోచనల మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీలోని భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కావని కొట్టిపడేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని రేవంత్ విమర్శించారు. ఈటలను బీజేపీలోకి పంపింది కేసీఆరేనని అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపే కార్యక్రమాలను చేపడతామని రేవంత్ పేర్కొన్నారు.