కత్తి మహేశ్ కంటికి తీవ్ర గాయం.. ఐసీయూలో చికిత్స

Kathi Mahesh eye injured in accident
  • నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేశ్
  • మహేశ్ ఎడమ కంటికి తీవ్ర గాయం
  • ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు
సినీనటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ ఈ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ... కత్తి మహేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరగిన వెంటనే ఆయనను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
 
ప్రస్తుతం కత్తి మహేశ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఎడమ కంటికి తీవ్ర గాయమయినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యం గురించి ఆయన స్నేహితులు ఆరా తీస్తున్నారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఈ సాయంత్రం వైద్యులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Kathi Mahesh
Accident
Eye Injury

More Telugu News