తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతారావు
- నేరెళ్ల శారద స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్న సునీత
- హైకోర్టు న్యాయవాది అయిన సునీతకు మహిళా సమస్యలపై అవగాహన
- హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షురాలిగానూ సేవలు
హైకోర్టు న్యాయవాది అయిన సునీత.. ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పీసీసీలో వివిధ పదవుల్లో ఆమె పనిచేశారు. కాగా, సునీత ఎంపికకు ముందు చాలా కసరత్తే జరిగింది. మొత్తం నలుగురు మహిళా నేతల వివరాలను తెప్పించుకున్న పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు సుస్మితా దేవ్.. వారిని ఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. అనంతరం సునీతను ఎంపిక చేశారు. మహిళా సమస్యలపై ఆమెకు పూర్తి అవగాహన ఉండడం, భాషపై పట్టుతోపాటు పార్టీకి విధేయురాలిగా ఉండడంతో ఆమెను ఎంపిక చేశారు.