తెలంగాణలో నేడు, రేపు ఓ మాదిరి వర్షాలు

Rains in telangana today and tomorrow
  • యూపీ నుంచి చత్తీస్‌గఢ్ వరకు ఉపరితల ద్రోణి
  • పశ్చిమ, వాయవ్య ప్రాంతం నుంచి తెలంగాణకు గాలులు
  • నిన్న 133 ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు
తెలంగాణలో నేడు, రేపు పలు చోట్ల ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీనికితోడు పశ్చిమ, వాయవ్య ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య రాష్ట్రంలోని 133 ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Telangana
Rains
UP
Chhattisgarh

More Telugu News