అమిత్ షాతో భేటీ అనంతరం మమత ప్రభుత్వంపై గవర్నర్ ధన్కర్ విమర్శలు
- 48 గంటల్లో అమిత్ షాతో రెండోసారి భేటీ అయిన ధన్కర్
- ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని గౌరవించాలని వ్యాఖ్య
- అధికారులు, పోలీసులు నిబంధనలను పాటించాలని సూచన
మమతా బెనర్జీతో పలు అంశాల్లో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో అమిత్ షాతో ధన్కర్ భేటీ అయ్యారు. బెంగాల్ లో చెలరేగుతున్న హింసపై చర్చించారు. ఆయన ఢిల్లీకి వెళ్లక ముందే మమత ప్రభుత్వంపై ఒక నివేదికను కేంద్రానికి పంపించారు. తన ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ప్రహ్లాద్ జోషి, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదురిలను ధన్కర్ కలిశారు.