తెలంగాణలో ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైంది: ఈటల
- షామీర్ పేటలో ఈటల మీడియా సమావేశం
- బీజేపీలో చేరడం పట్ల గర్విస్తున్నానని వెల్లడి
- 2024లో బీజేపీదే విజయం అని ధీమా
- హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యలు
హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రజలు తమ సొంత ఎన్నికలా తీసుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ తామే బరిలో ఉన్నట్టుగా భావిస్తున్నారని ఈటల వివరించారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైందని అన్నారు. హుజూరాబాద్ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిరూపం వంటిదని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మీడియా సమావేశంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.