Samantha: భారీ ఆఫర్ ను తిరస్కరించిన సమంత? 

Samantha rejected high remuneration
షార్ట్స్‌లో చూడండి
అందం .. అభినయం .. అదృష్టం .. ఈ మూడు ఉన్న కథానాయికగా సమంత కనిపిస్తుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఒకే సమయంలో స్టార్ హీరోయిన్ గా ఆమె చక్రం తిప్పేసింది. గ్లామర్ పరంగా .. నటన పరంగా సమంతకు వంక బెట్టవలసిన పనిలేదు. ఈ రెండు భాషల్లోని స్టార్ హీరోలతో ఆమె ఆడిపాడింది. ఈ రెండు భాషల్లోనూ ఆమెకి పెద్దసంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి అవకాశాల కోసం ఎదురుచూడవలసిన పరిస్థితి ఆమెకు రాలేదు.

అలాంటి సమంతకు ఇటీవల ఒక పెద్ద ఆఫర్ వచ్చిందట. ఓ స్టార్ హీరోతో ఓ పెద్ద బ్యానర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సినిమాలో కథానాయికగా వారు సమంతను అడిగారట .. భారీ పారితోషికమే ఆఫర్ చేశారట. అయితే అంత పెద్ద మొత్తం ఇస్తామని చెప్పినా సమంత చాలా సున్నితంగా తిరస్కరించిందని చెప్పుకుంటున్నారు. సమంత కొంతకాలంగా గ్లామరస్ పాత్రలకి దూరంగా ఉంటూ, నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతోంది. ఈ ఆఫర్ ను వదులుకోవడానికి కారణం అదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చేస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Samantha

More Telugu News